ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం
సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుందన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. జనవరి 16న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. నా మాటలు రాసి పెట్టుకోండి. ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. ఈ అబద్ధాలు నన్ను దెబ్బతీయలేవు. ఆ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. కుట్రలతో నా నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయి. నేను న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందనే నా అంచెంల విశ్వాసం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. నా పోరాటానికి ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుంది అని రాసుకొచ్చారు.