భారత్‌ పోల్‌ పోర్టల్‌ ప్రారంభం

అంతర్జాతీయ కేసుల విషయంలో కొత్త శకం ప్రారంభమైనట్లేనన్న కేంద్ర హోం మంత్రి

Advertisement
Update:2025-01-07 14:10 IST

కేసుల సత్వర విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించింది. భారత్‌ పోల్‌ పేరిట తీసుకొచ్చిన పోర్టల్‌ను మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. అంతర్జాతీయ కేసుల విషయంలో కొత్త శకం ప్రారంభమైనట్లేనని ఈ సందర్భంగా మంత్రి అభివర్ణించారు.

దర్యాప్తు సంస్థలు సరికొత్త సాంకేతిక పద్ధతులను వినియోగించుకొని పరారీలో ఉన్న నేరగాళ్లను అదుపులోకి తీసుకోవడానికి ఇది ఉపకరించనున్నది. ఏజెన్సీలు వేగవంతంగా అంతర్జాతీయ పోలీసుల సహకారం తీసుకోవడానికి సీబీఐ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలు ఇంటర్‌ పోల్‌తో సులువుగా కనెక్ట్‌ అవ్వడానికి ఇది వీలు కల్పిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లను గమనించి, మన వ్యవస్థల్లో మార్పులు చేసుకోవాల్సిన, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాల్సిన సమయం ఇది. ఆ దిశగా భారత్‌పోల్‌ అనేది ఒక అడుగు అని అమిత్‌ షా వెల్లడించారు. ఈ కొత్త వ్యవస్థతో పాటు, మూడు నేర చట్టాల గురించి రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను సీబీఐ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

Tags:    
Advertisement

Similar News