రోహిత్, కోహ్లీకి బాసటగా యువరాజ్ సింగ్
వాళ్లు గతంలో సాధించిన ఘనతను మర్చిపోయారా అని ఆవేదన
ఫాం కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ బాటసగా నిలిచారు. వాళ్లిద్దరు టీమ్ కు భారమయ్యాయని.. ఇక గుడ్ బై చెప్తే మంచిదని విమర్శలు గుప్పిస్తున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఆ ఇద్దరు రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవడమే మంచిదని సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పటి తన సహచరులకు యువరాజ్ అండగా నిలిచారు. ఆస్ట్రేలియాలో గతంలో రెండుసార్లు టీమిండియా సీరిస్ సాధించింది. ఇప్పుడు ఓడిపోయింది. ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి చెడుగా మాట్లాడటం మంచిది కాదు. గతంలో వాళ్లిద్దరు ఏ సాధించారో ఇప్పుడు విమర్శలు చేస్తున్న వాళ్లు మర్చిపోయినట్టు ఉన్నారు. దేశం వాళ్లిద్దరు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్ ను కోల్పోవడంపై వాళ్లిద్దరూ అందరికన్నా ఎక్కువే బాధపడుతారని తెలిపారు. ఫాం కోల్పోయానని స్వయంగా ఒక కెప్టెన్ తుది జట్టు నుంచి తప్పుకోవడం తాను ఎప్పుడూ చూడలేదని.. టీమ్ కోసం రోహిత్ అలాంటి త్యాగం చేశాడని అన్నారు. ఓడినా గెలిచినా రోహిత్ గొప్ప కెప్టెన్ అన్నారు. రోహిత్ సారథ్యంలో వన్ డే వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరుకున్నామని, టీ 20 వరల్డ్ కప్ సహా ఇంకా ఎన్నో సాధించామని గుర్తు చేశారు. రోహిత్, విరాట్ తన ఫ్యామిలీ అని.. తన సోదరులకు మద్దతుగా నిలవడం తన విధి అని తెలిపారు.