క్షీణించిన ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం
ఆయనను పాట్నాలోని ఆస్పత్రికి తరలించామని పేర్కొన్న సంబంధితవర్గాలు
బీపీఎస్సీ వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను సోమవారం పోలీసులు భగ్నం చేసి.. అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన షరతులు లేని బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా నాలుగు రోజుల పాటు నిరాహారదీక్ష చేయడంతో ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం క్షీణించిందని.. ఆయనను పాట్నాలోని ఆస్పత్రికి తరలించామని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి.
పోలీసులు దీక్షను భగ్నం చేసిన అనంతరం తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారనే విషయం తెలియజేయలేదని ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు పోలీసు వాహనంలోనే కూర్చోబెట్టి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారన్నారు. సరైన పత్రాలు లేకుండానే తనను కోర్టు నుంచి పోలీసులు తీసుకెళ్లారని పేర్కొన్నారు. తనను జైలుకు కూడా తీసుకెళ్లలేదని పేర్కొనడం గమనార్హం.
ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌సీ) నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత రెండు వారులుగా బీపీఎస్‌సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చెపడుతున్నా, ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రావడం లేదని మండిపడ్డారు. ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి.. మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. Also Read - నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్‌సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం విదితమే పరీక్షను రద్దు చేసి.. కొత్త మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఉద్యోగార్థులు తమ ఆందోళనల్ని ఉధృతం చేయగా.. ప్రశాంత్ కిశోర్ వాళ్లకు మద్దుతుగా నిలిచారు.