రేవంత్ అక్రమ కేసులకు భయపడం
ఎన్ని కేసులు పెట్టినా రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామన్న హరీశ్
కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. నందినగర్‌లో కేటీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై స్పందిస్తూ.. కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నది. ఇంకా చాలామంది నేతలపై రేవంత్‌రెడ్డి కేసులు పెడుతారు. రైతు భరోసాను రూ. 15 వేల నుంచి 12 వేలకు తగ్గించారు. రైతు భరోసా తగ్గింపు నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు, అక్ర కేసులకు భయపడేది లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా రేవంత్‌రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామని హరీశ్‌రావు అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా నీ వెంట పడతామని హెచ్చరించారు.అక్రమ కేసులతోనూ అరెస్టులతోనూ మమ్మల్ని బలహీనపరచాలని రేవంత్ రెడ్డి కుట్ర చెల్లదని ఎన్ని రకాల కేసులు పెట్టిన ఆయనను వదిలిపెట్టము అన్నారు.
రేవంత్ రెడ్డి అరెస్టయి జైల్లో పడడానికి ఈ కేసుకు పొంతనలేదు. ఆయన డబ్బుల కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు పోయాడుకేటీఆర్ మాత్రం తెలంగాణ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చాడు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం కేటీఆర్ అక్రమ కేసుకు పోల్చడమంటే మోకాలికి బోడి గుండుకు ముడి వేయడమే అన్నారు.ఈరోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు కేసులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదు. ఈ కేసులో తప్పు జరిగిందని కోర్టు శిక్ష ఏమీ వేయలేదు. విచారణ జరుపుకోవచ్చని మాత్రమే కోర్టు చెప్పిందని హరీశ్ గుర్తు చేశారు. కేటీఆర్ విచారణకు సిద్ధమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే అంశంపైన మా లీగల్ సెల్ నిర్ణయిస్తుందన్నారు. హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత మా లీగల్ సెల్ సలహా మేరకు తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు.మొన్న ఏసీబీ దగ్గరికి కూడా విచారణ ఎదుర్కోవడానికి కేటీఆర్ వెళ్లారు. 9వ తేదీన కూడా ఇచ్చిన నోటీసు మేరకు విచారణకు వెళ్తారుమొన్న 45 నిమిషాలు ఆపిన కేటీఆర్ ఓపిగ్గా వేచి చూశారు... కచ్చితంగా విచారణను ఎదుర్కొంటామన్నారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం కోసమే... ఫార్ములా ఈ ని కేటీఆర్ హైదరాబాద్ కి తెచ్చారు. ఇదే రేసును తమ రాష్ట్రాలకు నగరాలకు తీసుకురావడానికి అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి. ఒక్క రూపాయి కూడా చేతులు మారినప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుందని ప్రశ్నించారు. కేటీఆర్ అడుగడుగునా రేవంత్ రెడ్డి తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఈ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుబంధు ఎగగొట్టడం వల్ల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నది. అన్ని సర్వే రిపోర్టులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయి. అందుకే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన అక్రమ కేసు పెట్టి అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు.భవిష్యత్తులను ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కోసం కేసులు రేవంత్ రెడ్డి పెడతాడని మాకు తెలుసన్నారు.ఎన్నో పోరాటాలతోనే త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం .తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ అభివృద్ధిని మా పార్టీకి ముఖ్యమన్నారు. రేవంత్ రెడ్డి ని కూడా ఫార్ములా ఈ కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఇప్పటిదాకా బయట పెట్టలేదన్నారు.ఇది కక్ష సాధింపు చర్య మాత్రమే అన్నారు. ఎన్ని రకాల కేసులు పెట్టిన ఎన్ని రకాల కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడిన తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షమేనని తెలిపారు.
కేటీఆర్పెట్టిన కేసులు కానీ పార్టీ నేతల పైన పెడుతున్న కేసులను కానీ పార్టీ ఎదుర్కొంటుంది. ఆయన కడిగిన ముత్యంల బయటకి వస్తారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టి విచారణకి వెళ్తాం. ఆయన ముఖ్యమంత్రిగా మాకు అధికారుల పైన కోర్టుల పైన విశ్వాసం ఉన్నది కానీ రేవంత్ రెడ్డి పైన లేదన్నారు. కోర్టులో వచ్చిన తీర్పు పైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ హైకోర్టు చెప్పింది కేవలం విచారణ మాత్రమే చేయమని...విచారణ ప్రారంభం కాకముందే తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారుకొంతమంది హైకోర్టు తీర్పును తప్పుడుగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పైన పెట్టిన కేసు తుఫెల్ కేసు అని అక్రమ అరెస్టులకు మేము భయపడే వాళ్ళం కాదు... సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పైన చిచ్చరపిడుగుల్లా పోరాడిన చరిత్ర మాది
గతంలో అరెస్టై కేటీఆర్ వరంగల్ జైల్లో ఉన్నారని చెప్పారు. గ్రీన్ కో కంపెనీ రాష్ట్రంలో ఎలాంటి కాంట్రాక్టులు పొందలేదన్నారు.ఆ సంస్థ రూపాయి లబ్ధి చేయనప్పుడు వారు ఎందుకు మాకు తిరిగి డబ్బులు ఇస్తారు? అని నిలదీశారు. అదే గ్రీన్ కో కంపెనీ ఫార్ములా రేసులో భారీగా నష్టపోయింది .ఇలాంటి పరిస్థితుల్లో వారి నుంచి డబ్బులు వచ్చాయనడం అర్థరహితం. ఈ నెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తారని చెప్పారు. విచారణకు సహకరిస్తారు. అరెస్టులు, కేసులు మాకు కొత్తకాదు. విచారణకు న్యాయవాదితో వెళ్లడం తప్పేమీ కాదు. హైకోర్టు తీర్పు కాపీ పూర్తిగా పరిశీలించాక నిర్ణయం తీసుకుంటాం.