మూడు ఎక్సెప్రెస్‌ రైళ్ళపై దోపిడీ దొంగల బీభత్సం

అనంతపురం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున మూడు ఎక్సెప్రెస్‌ రైళ్ళపై దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఈ సంఘటనలో లోకో పైలెట్‌తో సహా చాలామంది గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళుతున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను, ముంబయి నుంచి బెంగుళూరు వెళుతున్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ను, నాందేడ్‌ నుంచి బెంగుళూరు వెళుతున్న నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను వీరు టార్గెట్‌ చేశారు. వీరు భారీ ఎత్తున నగలు, నగదు అపహరించినట్టు ప్రయాణీకులు చెబుతున్నారు. సిగ్నల్‌ కోసం ఈ రైళ్ళు ఆగినప్పుడు ఒక వ్యూహం […]

Advertisement
Update:2015-11-06 01:49 IST

అనంతపురం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున మూడు ఎక్సెప్రెస్‌ రైళ్ళపై దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఈ సంఘటనలో లోకో పైలెట్‌తో సహా చాలామంది గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళుతున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను, ముంబయి నుంచి బెంగుళూరు వెళుతున్న ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ను, నాందేడ్‌ నుంచి బెంగుళూరు వెళుతున్న నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను వీరు టార్గెట్‌ చేశారు. వీరు భారీ ఎత్తున నగలు, నగదు అపహరించినట్టు ప్రయాణీకులు చెబుతున్నారు. సిగ్నల్‌ కోసం ఈ రైళ్ళు ఆగినప్పుడు ఒక వ్యూహం ప్రకారం వీరు రైళ్ళపై దాడి చేసి ప్రయాణికులపై రాళ్ళు రువ్వుతూ భీభత్సం సృష్టించారు. దీంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. దొంగలు చేసిన రాళ్ళ దాడిలో చాలామంది గాయపడ్డారు. వీరిలో లోకో పైలెట్‌ కూడా ఉన్నాడు. అతనికి తల పగిలింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో 8 తులాల బంగారం, నగదు చోరీ చేశారు. దుండగులు రాళ్ల దాడి చేస్తూ ఎస్కార్టు పోలీసుల దృష్టి మరల్చి కిటికీల దగ్గర ప్రయాణికుల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. గుత్తి శివారులో సిగ్నల్‌ కోసం రైళ్లు వేచి ఉండగా వరుస సంఘటనలు జరిగాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఈ ఘటనలు జరిగాయి. ఈ దోపిడీ సంఘటనలో 12 మంది దొంగలున్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ప్రయాణికుల నుంచి వీరు భారీగా నగదును, నగలను ఎత్తుకెళ్ళి పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసుల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News