ఉద్యమపథంలోకి వైసీపీ టీచర్స్!
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైఎస్ఆర్‌కాంగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ (ఏసీ వైఎస్సార్ టీఎఫ్) సమరశంఖం పూరించింది. జులై 6న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాలిరెడ్డి తెలిపారు. గుంటూరులో జరిగిన వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో జాలిరెడ్డి మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు చేపడితే ప్రతిఘటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. […]
Advertisement
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైఎస్ఆర్‌కాంగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ (ఏసీ వైఎస్సార్ టీఎఫ్) సమరశంఖం పూరించింది. జులై 6న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాలిరెడ్డి తెలిపారు. గుంటూరులో జరిగిన వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశంలో జాలిరెడ్డి మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు చేపడితే ప్రతిఘటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈనెల 30న కలెక్టరేట్ల ఎదుట చేపట్టనున్న ధర్నాలకు వైఎస్సార్ టీఎఫ్ మద్దతు పలుకుతోందని తెలిపారు. సంఘం ప్రధానకార్యదర్శి ఓబుళపతి మాట్లాడుతూ పీఆర్‌సీల చెల్లింపులు, సాధారణ బదిలీలపై జులై 5 లోపు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 6వతేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
Advertisement