వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై మరో కేసు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై మరో కేసు నమోదు అయింది.;
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత అడపా మాణిక్యాలరావు గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దువ్వాడపై కేసు నమోదు చేశారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్‌పై ఏపీలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. మచిలీపట్నంతో పాటు గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్ ఠాణాల్లోనూ స్థానిక జనసేన నేతలు దువ్వాడపై కంప్లైంట్ చేశారు. పవన్‌పై ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో టెక్కలిలోని జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేయించినా అప్పట్లో పోలిసులు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా జనసైనికులు ఆరోపించారు.విచారణ జరిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు