అవసరమైతే రాజీనామా చేస్తా..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు;
కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి గెలిచింది నేను ఒక్కడినే అని మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ జనాభాలో అధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఉండాలని చెప్పారు. సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి.. ఎవరినైనా గెలిపిస్తానన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని కోరారు.
పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలని.. పదవులు కాదన్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చినవారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ కోసం కష్టపడిన వారిని పక్కనపెట్టడం సరికాదని చెప్పారు. ఒకవేళ నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే వేరే పార్టీ వాళ్లని నేనే గెలిపిస్తాని జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని అన్నారు.