ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కరానికి ప్రత్యేక చర్యలు
ఎల్‌ఆర్‌ఎస్, ఇంటర్ పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్;
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు చేసుకునే వారికి సహాయం అందించడానికి హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కరానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన వీలైనంత త్వరంగా పూర్తిచేయాలని కలెక్టర్లకు తెలిపారు. ఇప్పటికే ఫీజు చెల్లింపు దరఖాస్తులు ఇచ్చిన వాటిని ముందు క్లియర్ చేయాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్, ఇంటర్ పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సీఎస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 9, 96, 971 మంది విద్యార్థుల కోసం 1532 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటు చేయాలని తెలిపారు.