పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి..అప్పుడే ప్రభుత్వాన్నికి సార్థకత : మీనాక్షి
ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.;
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్ తీసుకున్నారు. ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..మంచిని మైకులో చెప్పండి.. చెడును చెవిలో చెప్పండి అని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి నామినేటేడ్ పోస్టులు ఇస్తామని స్పష్టం చేశారు. సమర్థులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పదవులు పొందిన వారు కష్టపడితే రెన్యువల్ చేస్తామని లేకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తామని తెలిపారు. మార్చి 10లోపు జిల్లాల వారీగా ఇన్‌ఛార్జి మంత్రులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలి’’ అని ఆదేశించారు
కార్పొరేషన్ డైరెక్టర్, మార్కెట్ చైర్మన్, టెంపుల్ కమిటీలలో ఖాళీలు, జిల్లాల్లో నామినేటేడ్ పోస్టులు తదిర పోస్టులను త్వరల్లో భర్తీ చేస్తామని సీఎం భరోసా కల్పించారు.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకూ మనం విశ్రమించొద్దు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవద్దు. రాహుల్ ప్రధాని అయితే, దేశం అభివృద్ధి అవుతుంది. కాంగ్రెస్‌కు తక్కువ.. ఎక్కువ.. అనే తారతమ్యాల్లేవు. అనుభవజ్ఞులైన ఇద్దరిని ఇప్పటికే రాజ్యసభకు నామినేట్ చేశామన్నారు. ఈ సందర్బంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతు ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం.. పేద వాడి కోసం పని చేయాలి. పేదల ముఖంలో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం రాష్ట్రంలో అధికారంలో ఉన్నంపేద వాడి కోసం పని చేయాలి. పేదల ముఖంలో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్టు అని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉంది.. అనేక రకాలుగా పోరాటాలు చేసాం.. అందుకే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని తెలిపారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జొడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారు. మనం దాని కోసం పోరాటం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చింది.. కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయిన సిద్ధంగా ఉన్నామని కీలక ప్రకటన చేశారు