ఎస్‌ఎల్‌బీసీకి టన్నెల్‌ వద్దకు బీజేపీ ఎమ్మెల్యేలు

మంత్రులు పిక్నిక్‌ మాదిరిగా వెళ్లి వచ్చారన్న ఏలేటి;

Advertisement
Update:2025-03-01 10:57 IST

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను నేడు బీజేపీ బృందం పరిశీలించనున్నది. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, వెంకటరమణారెడ్డి రాష్ట్ర నాయకులు మధ్యాహ్నం 12 గంటలకు సందర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి ప్రతినిధి బృందం బయలుదేరి వెళ్లింది. ప్రమాద ఘటన, టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులపై బీజేపీ ప్రతినిధి బృందం ఆరా తీయనున్నది. ప్రమాదంలో కార్మికులు మరణిస్తే ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని విమర్శించారు.ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సంఘటన స్థలానికి సీఎం వెళ్లకపోవడం దురదృష్టకరం అన్నారు. మంత్రులు పిక్నిక్‌ మాదరిగా వెళ్లివచ్చారని ఎద్దేవా చేశారు. ఆలోచన లేకుండా పనులు చేస్తున్నారని విమర్శించారు. అందుకే 45 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు నత్తనడక నడుస్తున్నాయన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటన జరిగిన వెంటనే కేంద్రం స్పందించింది. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News