వరంగల్ ఎయిర్‌ఫోర్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్‌, బీజేపీ తన్నులాట

తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది;

Advertisement
Update:2025-03-01 14:47 IST

వరంగల్ మామూనూర్ ఎయిర్‌ఫోర్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణుల శ్రమించున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎన్నో సార్లు కేంద్ర మంత్రులను కలిసి, దాని నిర్మాణానికి ఇంకా అధనంగా భూమి కావాలని అడిగితే.. గత ప్రభుత్వం కేబినెట్ అప్రూవల్‌తో 253 ఎకరాల భూమిని కూడా ఇచ్చిందని బీఆర్ఎస్ నేతలు శ్రేణులు చెబుతున్నారు.

ఇంత త్వరితగతిన ఎయిర్ పోర్టు మంజూరు కావడానికి విశేషంగా కృషి చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆ పార్టీ శ్రేణులు పోస్టులు చేస్తున్నారు. గతంలో కేటీఆర్ తీసుకున్న చొరవ,దానికి సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. వరంగల్‌ జిల్లాలో మామునూరు విమానాశ్రయం వద్ద ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో జై మోదీ అని బీజేపీ కార్యకర్తలు.. జై కాంగ్రెస్‌ అంటూ హస్తం పార్టీ నినాదాలు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాల నేతలు అడ్డుకున్నారు.

Tags:    
Advertisement

Similar News