ఏప్రిల్, మే నెలల్లో 44 - 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
ఉష్ణోగ్రతతో పాటు... వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి;
Advertisement
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని.. వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్, మే నెల వచ్చే సరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 1901 నుంచి 2025 వరకు సరాసరి సగటు తీసుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నది. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు డిగ్రీలు పెరిగే సూచనలున్నాయని తెలిపింది. 125 సంవత్సరాల సరాసరి సగటు తీసుకుంటే గాలిలో తేమ చాలా తగ్గిందని పేర్కొన్నది.
Advertisement