కోవర్టులు ఎవరు..? మనవారు ఎవరు..?. కమలంలో కొత్త కన్ఫ్యూజన్
వీరిద్దరూ మునుగోడు బీజేపీ స్టీరింగ్ కమిటీ మెంబర్స్. ఉప ఎన్నిక వ్యూహాలు, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు రచించాలి..? అనే విషయాలను వీరితో చర్చించారు.
మునుగోడు ఉప ఎన్నిక కమలానికి కొత్త భయం తీసుకొచ్చింది. ఉప ఎన్నిక ముందు కొందరు నేతలు కమలం కండువా కప్పుకున్నారు. వీరిలో స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కూడా ఉన్నారు. అయితే వీరు ఇప్పుడు జంప్ అయ్యారు. మొన్నటిదాకా బీజేపీ ప్రచారంలో పాల్గొన్న వీరు తమ వ్యూహాలు లీక్ చేస్తారు అనే అనుమానం కమలనాథులకు పట్టుకుంది.
బీజేపీలో చేరిన కొత్తవారికి మునుగోడు స్టీరింగ్ కమిటీలో ఛాన్స్ ఇచ్చారు. దాసోజు శ్రవణ్ రెండు నెలల కిందట పార్టీలోకి వచ్చారు. స్వామి గౌడ్‌ను అంతకుముందే పార్టీలో చేర్చుకున్నారు. వీరిద్దరూ మునుగోడు బీజేపీ స్టీరింగ్ కమిటీ మెంబర్స్. ఉప ఎన్నిక వ్యూహాలు, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు రచించాలి..? అనే విషయాలను వీరితో చర్చించారు. ఉప ఎన్నిక మీటింగ్‌లకు వీరు హజరయ్యారు, దీంతో తమ ప్రణాళికలను గులాబీ బాస్ చేరవేశారనేది కమలనాథుల డౌట్,
ఉప ఎన్నిక వేళ జట్కా తగలడంతో ఢిల్లీ హైకమాండ్ నుంచి తెలంగాణ లీడర్స్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఇద్దరు నేతలతో పాటు, ఇటీవల పార్టీలో చేరిన వారి వ్యవహారాలు ఆరా తీయాలనేది వారి సందేశం. అంతేకాదు ఉప ఎన్నిక వ్యూహం వెంటనే మార్చాలని చెప్పారట. కోవర్టులు ఎవరు? పార్టీకి కట్టుబడి పనిచేసే వారు ఎవరు? అనే విషయం తేల్చుకోవడంపై కమలనాథుల్లో మథనం మొదలైందట.
నిన్నటి నుంచే కారులో ఎక్కిన నేత నుంచి తమను కలుస్తున్న కొత్త నేతలను అనుమానం చూపులో బీజేపీ నేతలు చూస్తున్నారట. పార్టీ నేతల్లో కొత్తగా చేర్చుకునేవారిపై ఓ కన్నేసి ఉంచాలని అనుకుంటున్నారట. ఈ కోవర్టులతో మునుగోడు మునుగుతామా? అనే భయం బీజేపీ నేతలకు పట్టుకుంది,