తెలంగాణ అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యి : గుత్తా అమిత్
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యినే సరఫరా చేస్తామని తెలంగాణ డెయిరీ డెలవప్‌మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి చెప్పారు
తెలంగాణలో అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యినే సరఫరా చేస్తామని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తెలిపారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో పాల సేకరణ ధరను మూడు సార్లు రూ.12.48 రూపాయలు పెంచారని తెలిపారు. ఇకపై విజయ డైరీ పాల అమ్మకాలు మరింత పెంచడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు, పాఠశాలలకు, జైళ్లు, ఆసుపత్రులకు అవసరమైన పాలు, పాల పదార్ధాలు సరఫరా చేస్తామమని ఆయన తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పాల సేకరణ రేటు పెంచడంతో మిల్క్ సేకరణ గణనీయంగా పెరిగిందన్నారు. అలాగే పెండింగ్ పాల బిల్లులను కూడా త్వరలోనే చెల్లిస్తామని ఆయన చెప్పారు. టీటీడీ లడ్డూ తయారికి విజయ డెయిరీ నెయ్యి పంపించడానికి సిద్దంగా ఉన్నమని తిరుమల ఈవో శ్యామలరావు కోరిన సంగతి తెలిసిందే