నటి జత్వానీ వేధింపుల కేసులో ఐపీఎస్‌‌ల సస్పెన్షన్‌ పొడిగింపు

నటి జత్వానీ వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.;

Advertisement
Update:2025-03-12 17:38 IST

ముంబైయి నటి జత్వానీ వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నిని గతంలో సస్పెండ్‌ చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ గడువు ముగియడంతో సస్పెన్షన్‌ను సెప్టెంబరు 25 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరు నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలు ఉన్నాయి. ముంబై నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులో ముంబయి సినీ నటి కాదంబరీ జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ఈ ముగ్గురిపై పలు అభియోగాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News