ఎల్లుండి మద్యం షాపులు బంద్ ఎందుకంటే?

హోలీ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు;

Advertisement
Update:2025-03-12 20:21 IST

హైదరాబాద్ వ్యాప్తంగా మార్చి 14న గ్రేటర్ పరిధిలో మద్యం షాపులు బంద్ చేయాలని సైబరాబాద్ పోలీస్‌లు తెలిపారు. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ 6 గంటల వరకు ఆంక్షలు విధించారు.రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాదు.. రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు. బైకులపై, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని తెలిపారు. బహిరంగ ప్రదేశాలపై, ఇష్టం లేని వ్యక్తులపై, వాహనాలపై రంగులు, రంగు నీళ్లు చల్లకూడదని పేర్కొన్నారు

Tags:    
Advertisement

Similar News