కేంద్ర మంత్రికి తప్పిన పెను ప్రమాదం
కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కారు ప్రమాదానికి గురైంది.;
Advertisement
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కారు ప్రమాదానికి గురైంది. విజయ చౌక్ నుంచి ఎయిర్‌పోర్టుకు ఆయన కారులో బయల్థేరగా దారిలో ఓ వాహనాన్ని తప్పించబోయి కేంద్రమంత్రి డైవర్.. సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారును శ్రీనివాసవర్మ వాహనం ఢీకొట్టింది. ఆకస్మత్తుగా బ్రేక్ వేయడంతో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తల, కాలుకు స్వల్పగాయాలు అయ్యాయి.. సొంత నియోజకవర్గం నర్సాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టుతోనే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విజయవాడ బయలుదేరారు. ప్రమాదం జరిగిందని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.
Advertisement