ఫసల్‌ బీమా యోజన స్కీమ్‌లోకి తెలంగాణ.. లాభమా.. నష్టమా..?

గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. రైతుల కంటే ఇన్సూరెన్స్ కంపెనీలు లాభపడ్డాయని తేలింది. ఈ కారణాలతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ స్కీమ్‌ నుంచి వైదొలిగింది.

Advertisement
Update:2024-03-01 21:32 IST

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో తిరిగి చేరాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్‌. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 2016లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన స్కీమ్‌ను తీసుకువచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం. 2016 నుంచి 2019 వరకు ఈ స్కీమ్‌లో కొనసాగింది తెలంగాణ. తర్వాత ఆ స్కీమ్‌ నుంచి వైదొలగాలని అప్పటి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా తిరిగి ఈ స్కీమ్‌లో చేరింది రేవంత్ సర్కార్. వచ్చే పంటకాలం నుంచి రాష్ట్రంలో ఈ స్కీమ్‌ అమల్లోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ కలిశారు. పంట నష్ట పోతే రైతులకు బీమా అందుతుందని చెప్పారు రితేష్‌. రైతుల మేలు కోరే ఈ పథకంలో చేరుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. రైతుల కంటే ఇన్సూరెన్స్ కంపెనీలు లాభపడ్డాయని తేలింది. ఈ కారణాలతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ స్కీమ్‌ నుంచి వైదొలిగింది. ఇక ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ సైతం ఈ అంశాన్ని అనేక సార్లు లెక్కలతో సహా వివరించారు. ఫసల్ బీమా యోజన స్కీమ్‌ రాఫెల్ స్కామ్‌ కంటే పెద్ద కుంభకోణమని ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News