ఎనిమిదిమందిని కాపాడటానికి సహాయక చర్యల్లో వేగం పెంచాలి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Advertisement
నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటన, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సీఎంకు వివరించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడటానికి సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సీఎం సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలన్నారు. సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
Advertisement