తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్లకు ఆహ్వానం
ఇప్పటివరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలకు అవకాశం
Advertisement
మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్రంలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలకు అవకాశం లభించింది. నాణ్యత, ప్రమాణాలపై సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోనున్నది. ఆయా కంపెనీలు.. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆరోపణలు లేవని తెలుపుతూ దరఖాస్తుతో పాటు సెల్ఫ్ సర్టిఫికేషన్ జతపరచాలని టీజీబీసీఎల్ తెలిపింది.
Advertisement