రేవంత్‌కు రాహుల్ ఫోన్
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం... సహాయక చర్యలపై ఆరా
Advertisement
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడటానికి రెస్క్కూ బృందం తీవ్రంగా శ్రమిస్తున్నది. టన్నెల వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులను రక్షించడానికి జరుగుతున్న చర్యలపై ఆరా తీశారు. ఇద్దరు నేతలు సుమారు 20 నిమిషాల పాటు మాట్లాటుకున్నారు. ఘటన జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఘటనాస్థలికి వెళ్లారని రాహుల్‌కు రేవంత్ తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లాయని వివరించారు. క్షతగాత్రులకు చికిత్ స అందిస్తున్నట్లు చెప్పారు. చిక్కుకున్న వారిని రక్షించడానికి అన్ని ప్రయత్నాలను చేయాలని రేవంత్‌కు రాహుల్ సూచించారు.
Advertisement