ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం: కొనసాగుతున్న సహాయక చర్యలు
11 కి.మీ నుంచి 14 కి.మీ వరకు నడుచుకుంటూ వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల మేర నీరు నిలిచి ఉన్నాయి. 11 కి.మీ నుంచి 14 కి.మీ వరకు నడుచుకుంటూ ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెళ్లారు. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ రెండు వైపులా పూర్తిగా మట్టి, బురద నిండిపోయాయి. ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వెనకకు వచ్చిందని ఏజెన్సీ తెలిపింది. అతి కష్టం మీద టీబీఎం ముందు వైపునకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బైటికి తీయలేని పరిస్థితి ఉన్నది. సహాయ చర్యల్లో పాల్గొన్న 24 మందితో కూడిన ఆర్మీ బృందం, 130 మంది ఎన్డీఆర్‌ఎఫ్, 24 మంది హైడ్రా బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్, 120 మందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం పాల్గొంటున్నాయి.సహాయక చర్యలపై నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ సమీక్షా సమావేశం నిర్వహంచారు. ఇందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు.టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద భారీగా బురద నీరు చేరింది. మరో రెండు గంటల్లో బాధితుల వద్దకు చేరుకునే అవకాశం ఉన్నదని నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఫిషింగ్ బోటు, టైర్లు, చెక్కబల్లలు వేసి దాడటానికి రెస్క్యూ టీం యత్నిస్తున్నది. 100 మీటర్ల బురద స్థలాన్ని దాటితనే ప్రమాదస్థలికి బృందాలు వెళ్లనున్నాయన్నారు.8 మంది బాధితుల ఆచూకీ ఇంకా తెలియలేదని ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండర్ సుఖేందు తెలిపారు. మట్టినీటితో సహాయక చర్యలకు ఆటంకం కలుగుందన్నారు.టీబీఎం ముందు చిక్కుకున్న 8 మంది బాధితులను కాపాడటానికి అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.