తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు విడుదల
Advertisement
తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్, సీఐడీ ఎస్పీగా నవీన్ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సీఐడీ ఏడీసీగా రామ్‌రెడ్డి, ఇంటలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్పీ డీసీపీగా చైతన్యకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు విడుదల చేశారు.
Advertisement