ఆదిలాబాద్‌లో ఐటీ టవర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం... రూ.40 కోట్లు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం ICT పాలసీ, రూరల్ టెక్నాలజీ పాలసీ కింద ఆదిలాబాద్‌లోని మనలాపన్ మండలం బట్టిసావర్గావ్ గ్రామంలో ఐటీ టవర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం బట్టిసావర్‌గావ్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 72లో మూడు ఎకరాల భూమిని గుర్తించింది.

Advertisement
Update:2023-02-03 07:57 IST

హైదరాబాద్ ఇప్పటికే ఐటీ రంగంలో దేశంలోనే ముందంజలో ఉండగా, రాష్ట్రంలో మరిన్ని పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనిలో భాగంగా రెండవ శ్రేణి పట్టణాల్లో మరిన్ని ఐటీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. తాజాగా ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం ICT పాలసీ, రూరల్ టెక్నాలజీ పాలసీ కింద ఆదిలాబాద్‌లోని మనలాపన్ మండలం బట్టిసావర్గావ్ గ్రామంలో ఐటీ టవర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం బట్టిసావర్‌గావ్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 72లో మూడు ఎకరాల భూమిని గుర్తించింది.

48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం రూ.40 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఐటీ శాఖ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది.

Tags:    
Advertisement

Similar News