జూలై 17 నుండి 31వరకు తెలంగాణ డీఎస్సీ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11,602 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తోంది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,508 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.
తెలంగాణ డీఎస్సీకి దరఖాస్తు గడువును విద్యాశాఖ పొడిగించింది. అదే విధంగా పరీక్షల నిర్వహణ తేదీలను కూడా ప్రకటించింది. దరఖాస్తులకు గడువు ఈరోజుతో ముగియనుండగా దాన్ని జూన్ 20 వరకు పొడిగించింది. పరీక్షను జూలై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
11,602 పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11,602 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తోంది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,508 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. భాషాపండితులు, పీఈటీల పోస్టుల కూడా ఉన్నాయి. పొడిగించిన గడువు ప్రకారం జూన్ 20వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు..?
ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయో కూడా స్పష్టత వచ్చింది. రాష్ట్రంలోనే అత్యధిక పోస్టులు హైదరాబాద్‌లో 878 ఉన్నాయి. తర్వాత నల్గొండలో605, నిజామాబాద్‌లో 601 ఉపాధ్యాయ పోస్టులను ఈ డీఎస్సీలో భర్తీ చేయబోతున్నారు.