మీర్‌పేట్ మాధవి హత్య కేసులో షాకింగ్ విషయాలు
మీర్పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో మరో కొత్తకోణం వెలుగుచూసింది.
మీర్ పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన సంఘటనలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని నిందితుడు గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మర్డర్ వెనుక మరో ముగ్గురి హస్తం ఉన్నట్లు మీర్ పేట పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, నిందితుడు గురుమూర్తి తన భార్యను హత్య చేసే క్రమంలో అతనికి మరో ముగ్గురు సాయం చేశారని.. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తిని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక విషయాలు వెల్లడి అవుతాయని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం పెళ్లియింది.
వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా చేరి నాయక్ సుబేదార్‌గా వాలంటీర్ రిటైర్మెంట్. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్‌డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేశాడు. ఈ మేరకు మీర్‌పేట పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి గురుమూర్తిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. సరూర్‌నగర్‌లోని సీసీఎస్ లేదా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12 వరకు వరకు అతన్ని విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.