డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేత
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వన్నికి అందజేసింది.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వన్నికి అందజేసింది. కమిషన్ ఛీప్ బూసాని వెంకటేశ్వర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కలిసి రిపోర్ట్‌ను అందజేశారు. అసెంబ్లీ సెగ్మంట్లు వారిగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆరు సెగ్మంట్లు రూపంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డెడికేటెడ్ కమిషన్ దాదాపు మూడు నెలలు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేసింది.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన, దానికి అనుగుణంగా ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 4వ తేదీన డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌కు చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావును, సభ్య కార్యదర్శిగా బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి.సైదులను నియమించింది. నెలరోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది.