తన ఇల్లు కూల్చొద్దని ప్రజావాణిలో కోరిన అల్లు అర్జున్ మామ

తన ఇల్లు కూల్చించే విషయంపై పునరాలోచించాలని అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
Update:2025-02-10 16:09 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి తన ఇల్లు కూల్చొద్దని ప్రజావాణిలో కోరారు. కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణలో తన ఇల్లు స్థలం ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 36 అడుగుల భూమిని సేకరించే అంశంపై పునరాలోచించాలని ప్రజావాణిలో ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-92లో తమ ప్రాపర్టీస్ విషయంపై తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని అధికారులను చంద్రశేఖర్‌ రెడ్డి కోరారు. కొన్ని నెలల క్రితం కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

అందుకోసం రూ.1100 కోట్లు ఖర్చు చేయాలని అధికారులు ప్లాన్‌ చేశారు. ఇందులో భాగంగానే రోడ్డు విస్తరణతో పాటుగా పలు కార్యక్రమాలను చేపట్టారు.ఇదిలా ఉండగా.. ఇటీవల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరి భేటీ సందర్భంగా వారిద్ధరూ ఏ అంశాలపై చర్చించారన్న దానిపై వివరాలు వెల్లడి కాలేదు. అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ తర్వాతా చంద్రశేఖర్ రెడ్డి, గాంధీభవన్‌కు రెండోసారి వెళ్లడం చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News