ఆ సినతల్లి బిడ్డ పేరు ''భూమి నాయక్''
లగచర్ల జ్యోతి బిడ్డకు పేరు పెట్టిన కేటీఆర్
Advertisement
లగచర్ల సినతల్లి యాదికున్నదా..? సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తలపెట్టిన ఫార్మా విలేజ్ భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించి భర్త జైలుకు పోతే న్యాయపోరాటం సాగించిన నిండు గర్భిణి.. ఆమె లగచర్ల జ్యోతి. జ్యోతి సహా లగచర్ల గిరిజన ఆడబిడ్డలు సాగించిన పోరాటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి ఫార్మా విలేజ్ స్థాపన నుంచి వెనక్కి తగ్గింది. సోమవారం కోస్గీలో నిర్వహిస్తున్న రైతు దీక్షలో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్తూ లగచర్లకు వెళ్లారు. అప్పుడే లగచర్ల సిన్నతల్లి (జ్యోతి) తాను జన్మనిచ్చిన ఆడబిడ్డను కేటీఆర్ చేతుల్లో పెట్టింది. తన బిడ్డకు పేరు పెట్టాలని కోరింది. ఆ బిడ్డను ఎత్తుకున్న కేటీఆర్ ఆమెను చూసి మురిసిపోయారు. ఆ చిన్నారికి ''భూమి నాయక్'' అని పేరు పెట్టారు.
Advertisement