రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున మొత్తం 17లక్షల మంది ఖాతాలో 2223.46 కోట్లు నిధులు విడుదల చేసింది. దీంతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 37 లక్షల ఎకరాల్లో రైతు భరోసా నిధులు విడుదల అయ్యాయి. దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు) మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు రైతులు ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించారని అన్నారు. జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించి, రైతులకు ఎకరానికి రూ.12,000 పెట్టుబడి సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.
ఈ మొత్తం ఏడాదిలో రెండు విడతలుగా జమ చేయనున్నారు. ప్రస్తుత విడతలో రైతుల ఖాతాల్లో రూ.6,000లు జమ చేయడం జరిగింది. పథకం ప్రారంభమైన రోజు రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, అక్కడ నిధులను విడుదల చేశారు. మొత్తం 4.42 లక్షల మంది రైతులకు రూ.593 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీరి ఖాతాల్లో జనవరి 27న డబ్బులు జమయ్యాయి. అయితే, మిగిలిన రైతులకు ఫిబ్రవరి 5 నుంచి పెట్టుబడి సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం 17.03 లక్షల మంది అర్హత కలిగిన రైతులకు మరో రూ.533 కోట్లను విడుదల చేసింది.