మరికొన్ని గంటల్లో షర్మిల డిశ్చార్జ్.. వాట్ నెక్స్ట్

తెలంగాణలో పార్టీ పెట్టినప్పటినుంచి షర్మిల పదే పదే వల్లెవేసే డైలాగ్ ఒక్కటే. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, నన్ను జైలులో పెట్టండి అంటూ ఆమె సవాళ్లు విసిరేవారు.

Advertisement
Update:2022-12-11 15:23 IST

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరికొన్ని గంటల్లో అపోలో ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అవుతారు. 2 లేదా మూడు వారాలపాటు ఆమె ఇంటికే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమేరకు ఆస్పత్రి వర్గాలు షర్మిలకు విశ్రాంతి అవసరం అని హెల్త్ బులెటిన్ లో సూచించారు. డాక్టర్లు చెప్పారు కాబట్టి షర్మిల లోటస్ పాండ్ కే పరిమితం అవుతారా లేక, వీరావేశంతో మళ్లీ జనంలోకి వస్తారా, సింపతీకోసం ట్రై చేస్తారా.. అనేది వేచి చూడాలి.

షర్మిల టార్గెట్ ఏంటి..?

తెలంగాణలో పార్టీ పెట్టినప్పటినుంచి షర్మిల పదే పదే వల్లెవేసే డైలాగ్ ఒక్కటే. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, నన్ను జైలులో పెట్టండి అంటూ ఆమె సవాళ్లు విసిరేవారు. అదే ఊపులో ఆమె ప్రగతి భవన్ ముట్టడి అంటూ రోడ్డుపై షో చేసి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జైలుకెళ్లకుండా బెయిలుపై బయటకొచ్చారు. వచ్చీరాగానే మళ్లీ పాదయాత్ర చేస్తానని పర్మిషన్ అడిగారు. ఈసారి పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఇంట్లోనే నిరాహార దీక్ష మొదలు పెట్టి చివరకు ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నారు.

ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ..

తెలంగాణలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ లోపాయికారీ ఒప్పందాలన్నీ బయటపడుతున్నాయి. షర్మిల వెనక బీజేపీ ఉందనే విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేసింది. షర్మిల యాక్షన్ కి వెంటనే బీజేపీ నుంచి రియాక్షన్లు వస్తున్నాయి. నేరుగా గవర్నర్ కూడా షర్మిలపై సింపతీ చూపిస్తూ తన నైజాన్ని చాటుకున్నారు. ఇక మిగిలిందల్లా ఉమ్మడి శత్రువుపై కలసి పోరాటం మొదలు పెట్టడమే. బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం షర్మిల వెయిట్ చేస్తున్నారని తేలిపోయింది. రాజకీయ స్వలాభం కోసం పక్క రాష్ట్రంలో ఉన్న అన్నపై, వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్న షర్మిల, తెలంగాణలో హడావిడి సృష్టించడంకోసం ప్రయత్నం చేస్తున్నారు. మొన్న పోలీస్ స్టేషన్లో సీన్ క్రియేట్ చేశారు, ఇప్పుడు ఆస్పత్రిలో సెలైన్ బాటిల్స్ తో కనిపిస్తున్నారు. హెల్త్ బులిటెన్ లు అంటూ డాక్టర్లు హడావిడి మొదలుపెట్టారు. ఈ హంగామాని షర్మిల కొనసాగిస్తారా, కొన్నిరోజులు గ్యాప్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News