"నాయకుడు కష్టాల్లో ఉన్నాడు.." - బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే సందేశం

అంతా కలిసికట్టుగా పనిచేయాలి. పార్టీ మారిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. మా లీడర్లకు ఎవరికీ పార్టీ మారే ఆలోచన లేదు. కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు కూడా ఆ ఆలోచన రానివ్వొద్దు.

Advertisement
Update:2024-03-23 16:36 IST

పార్టీని వీడుతున్న బీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులకు గట్టి కౌంటరిచ్చారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌. గుర్తింపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని విడిచి వెళ్లడం మంచి పద్ధతి కాదు అంటూ పరోక్షంగా చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. "పోయెటోడు పోతనే ఉంటడు, వచ్చేటోడు వస్తనే ఉంటడు. పొయేటోని ఖర్మ, వాడు పోతున్నడు. ఇవాళ మన పార్టీ ఓడిపోయింది. మన నాయకుడు కష్టాల్లో ఉన్నడు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడితే మన నాయకుడికి పట్టు ఎలా దొరుకుతుంది?. మనల్ని ఆయన నమ్ముకుని ఉన్నప్పుడు, మనం కూడా ఆయన్ని నమ్ముకుని ఉండాలి. లేదంటే రేపటిరోజున మనల్ని కూడా ఎవరూ నమ్మరు".

"అంతా కలిసికట్టుగా పనిచేయాలి. పార్టీ మారిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. మా లీడర్లకు ఎవరికీ పార్టీ మారే ఆలోచన లేదు. కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు కూడా ఆ ఆలోచన రానివ్వొద్దు. చేవెళ్ల పార్లమెంట్ ప‌రిధిలో నలుగురు ఎమ్మెల్యేలం మన‌మే ఉన్నాం. మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ మన చేతుల్లోనే ఉన్నాయి. 7 ఎమ్మెల్యే సీట్లలో 4 మనవే. మనం తలుచుకుంటే చేవెళ్ల పార్లమెంట్‌లో బంపర్‌ మెజారిటీతో గెలవొచ్చు" అని అన్నారు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్.

Tags:    
Advertisement

Similar News