ఫిబ్రవరిలో రాష్ట్రంలో రాహుల్‌ సభ

ఈ నెలాఖరులోపు నామినేటెడ్‌, కార్పొరేషన్‌ ఛైర్మన్ల భర్తీ ఉంటుందన్న మహేశ్ కుమార్‌ గౌడ్‌

Advertisement
Update:2025-01-15 20:30 IST

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో తెలంగాణ ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు సుమారు గంటన్నరపాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేసీ వేణుగోపాలతో చర్చించారు.

ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ సభ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. కేసీ వేణుగోపాల్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్‌ సభ ఉండే అవకాశం ఉన్నది. ఈ నెలాఖరులోపు నామినేటెడ్‌, కార్పొరేషన్‌ ఛైర్మన్ల భర్తీ ఉంటుంది. క్యాబినెట్‌ విస్తరణపై సీఎం, అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించాం. ప్రజల్లో ఉన్న వారికే డీసీసీ అధ్యక్ష పదవులు ఇస్తామని మహేశ్‌కుమా్‌ గౌడ్‌ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News