పేదింటి బిడ్డ డాక్టర్‌ కలకు ఎన్‌ఆర్‌ఐ అండ

కేటీఆర్‌ చేతుల మీదుగా చెక్కు అందజేత

Advertisement
Update:2024-10-14 14:58 IST

పేదింటి బిడ్డ డాక్టర్‌ కలకు ఓ ఎన్‌ఆర్‌ఐ అండగా నిలిచాడు. ఆమెకు ఫస్టియర్‌ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. తన అభిమాన నాయకుడు కేటీఆర్‌ చేతుల మీదుగా ఆ విద్యార్థిని ఫస్టియర్‌ ఫీజు చెల్లించేందుకు అవసరమైన మొత్తాన్ని చెక్‌ ద్వారా అందజేయించాడు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాలకు చుందిన బి. గౌరి నీట్‌ లో మంచి ర్యాంక్‌ సాధించి ఎంబీబీఎస్‌ సీటు దక్కించుకుంది. నిరుపేద కుటుంబం కావడంతో ఫీజు చెల్లించలేని స్థితిలో ఆమె కుటుంబం ఉంది. గ్రామానికి చెందిన ఒకరు వారి పరిస్థితిని 'ఎక్స్‌' ద్వారా కేటీఆర్‌ కు తెలియజేశారు. స్పందించిన కేటీఆర్‌ గౌరి ఎంబీబీఎస్‌ పూర్తి చేసే వరకు ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్‌ఆర్‌ఐ దూడల వెంకట్‌ తన బర్త్‌ డే సందర్భంగా ఫస్టియర్‌ ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. ఫస్టియర్‌ ఫీజు మొత్తం రూ.1.65 లక్షలను సోమవారం నందినగర్‌ లోని కేసీఆర్‌ నివాసంలో తన తండ్రి దూడల రవీందర్‌, కేటీఆర్‌ చేతుల మీదుగా గౌరి, ఆమె కుటుంబ సభ్యులకు అందజేయించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఎంబీబీఎస్‌ సీటు సాధించిన గౌరిని అభినందించారు. వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలసుకున్నారు. తన తండ్రి కూలి పని చేస్తూ తనతో పాటు నలుగురు పిల్లలను కష్టపడి చదివిస్తున్నారని, తాను గురుకులంలో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశానని గౌరి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News