గోండు భాషలో ప్రాథమిక విద్యపై అధ్యయనం చేయండి

అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

Advertisement
Update:2025-01-10 17:15 IST

గోండుతో పాటు ఆదివాసీల మాతృభాషలో ప్రాథమిక విద్య బోధన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్‌ లో ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు వివరించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సమావేశమే ఇంద్రవెల్లిలో పెట్టామన్నారు. ఆదివాసీల్లో విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆదివాసీలతో పాటు ఎస్టీలకు సంబంధించిన ఓవర్సీస్‌ పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేస్లాపూర్‌ జాతరకు నిధులు మంజూరు చేయాలన్నారు. ఆదివాసీలపై ఉన్న ఉద్యమ కేసులు తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఆదేశించారు. సాగునీటి సదుపాయాలు పెంచేందుకు ఇందిర జలప్రభ ద్వారా బోర్లు వేయాలని సూచించారు. ఉచితంగా సోలార్‌ మోటార్లు అందజేయాలన్నారు. సమావేశంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News