కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం
రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై సమావేశంలో దిశానిర్దేశం
Advertisement
సెక్రటేరియట్ లోని ఏడో ఫ్లోర్ లో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత నిర్వహిస్తోన్న ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, సివిల్ సప్లయీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి ప్రభుత్వం రైతుభరోసా సహా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించనునంది. ఈనేపథ్యంలో ఆయా పథకాల అమలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లబ్ధిదారుల ఎంపిక సహా ఇతర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Advertisement