26 తర్వాత జిల్లాలకు రేవంత్ రెడ్డి
కలెక్టర్ల సమావేశంలో తెలిపిన సీఎం
Advertisement
రిపబ్లిక్ డే తర్వాత జిల్లాల పర్యటనకు వస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సెక్రటేరియట్ ఏడో ఫ్లోర్ లో నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో రైతుభరోసా, భూమి లేని పేదలకు ఏడాదికి రూ.12 వేల సాయం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు పంపిణీ చేయబోతుందని తెలిపారు. జిల్లాల పర్యటనకు వచ్చి ప్రజలను కలుస్తానని చెప్పారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని.. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు.
Advertisement