హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలు

విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌

Advertisement
Update:2025-02-19 14:02 IST

విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్‌ఆర్టీసీ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. లహరి నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ సర్వీసుల్లో 8 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్‌ఆర్టీసీ కోరింది. ముందస్తు రిజర్వేషన్‌ కోసం వెబ్‌సైట్‌ ను https://www.tgsrtcbus.in సందర్శించాలని సూచించింది. 

Tags:    
Advertisement

Similar News