రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం.. చల్లబడిన వాతావరణం
హైదరాబాద్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు ప్రాంతల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది
Advertisement
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల పరిసర ప్రాంతాలలో ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో ఇప్పటి వరకు ఎండలతో మండిపోయిన ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించింది. వేసవి సమీపిస్తున్న తరుణంలో దేశంలోని కొన్ని రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది.
బంగాళాఖాతంలో ఉపరితలంలో ఆవర్తనం ఏర్పడి ఈశాన్య దిశగా కొనసాగుతున్నదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. బంగాళాఖాతం మీదుగా తుఫాన్ గాలులు వీయనున్నాయని, దీంతో రానున్న వారం రోజులు ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ర్టాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Advertisement