ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌

ఇందులో అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం

Advertisement
Update:2025-02-21 08:12 IST

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దీనికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసింది పురపాలికలు, పట్టణాల్లో ఇళ్లు లేని నిరుపేదలు నమోదు చేసుకున్నారు. సంబంధిత అధికారులు సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ తమ దరఖాస్తు ఏ స్థితిలో ఉన్నదో తెలియక చాలామంది పంచాయతీ, మండల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వారికి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇందులో అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తు వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇందిరమ్మ లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం https://indirammaindlu.telangana.gov.in/login వెబ్‌సైట్‌ను రూపొందింది. గూగుల్‌లోకి వెళ్లి దీన్ని ఓపెన్‌ చేసిన తర్వాత ఆధార్‌ నెంబర్‌ నమోదు చేయాలి. దీంతో అప్లికేషన్‌ స్టేటస్‌ కనిపిస్తుంది. అప్లికేషన్‌ ఇచ్చిన మొబైల్‌ నెంబర్‌ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. అనంతరం పేరు, చిరునామా, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిర్యాదుల కేటగిరి ఆప్షన్‌ డ్యాష్‌బోర్డుపై కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్‌ చేయగానే సమాచారం. కనిపిస్తుంది. ఇందులో దరఖాస్తుదారు ఎదుర్కొన్న సమస్యను ఎంపిక చేసుకోవాలి. కింద ఉన్న బాక్స్‌లో ఫిర్యాదు వివరాలు రాయాలి. అనంతరం స్థలం లేదా ఇతర ధ్రువపత్రాలు 2 MB సైజులో పీడీఎఫ్‌, పీఎన్‌జీ, జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత ఫిర్యాదు నెంబర్‌ వస్తుంది. దానిని సేవ్‌ చేసుకోవాలి.

Tags:    
Advertisement

Similar News