జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు తీవ్ర అనారోగ్యం

బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు

Advertisement
Update:2025-02-20 20:50 IST

హైదరాబాద్ బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి కుటుంబ సభ్యులు తరలించారు. గత కొంత కాలంగా మాగంటి గోపినాథ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గత నాలుగు క్రితం ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే గోపీనాథ్‌కు కిడ్నీ ఫెయిల్యూర్ అని వైద్య పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన డాక్టర్లు పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై అటు వైద్యులు గానీ, ఇటు కుటుంబసభ్యులు గానీ ఎలాంటి వివరాలు ప్రకటించలేదు.

మాగంటి గోపీనాథ్ 1983లో టీడీపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ టీడీపీ టికెట్‌పై గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతోన్నారు. 2019 ఎన్నికల్లో సైతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు.

Tags:    
Advertisement

Similar News