ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారు
అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీ వద్దని అనుకుంటున్నారన్న బండి సంజయ్
Advertisement
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తుండటంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీ వద్దని అనుకుంటున్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందే. మేధావి వర్గం అంతా మా పార్టీకే ఓటు వేశారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలి. శాసససభలో మీ సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ ఒక్కటే అని బండి సంజయ్ అన్నారు.
Advertisement