తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులతో ప్రమాణం చేయించారు.

Advertisement
Update:2023-12-09 14:26 IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాస‌న‌స‌భ్యులుగా ఎన్నికైన వారితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ ఆస్పత్రి చికిత్స పొందుతున్న కార‌ణంగా ఆయన సభకు రాలేకపోయారు. కేటీఆర్ తండ్రి వెంట ఉండటంతో ఆయన కూడా స‌భ‌కు హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్ కూడా సభకు హాజరు కాలేదు. తాము ప్రమాణ స్వీకారం చేసేందుకు మరోసారి సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కోరారు.

ఇక ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ నియామకాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రమాణ స్వీకరానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నికైన తర్వాతే తాము ప్రమాణ స్వీకారం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. అసెంబ్లీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ కావాలనే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ నియామకంతో కాంగ్రెస్-ఎంఐఎం మధ్య ఉన్న బంధం మరోసారి బయటపడిందని ఆయన ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News