కేసీఆర్ పుట్టినరోజున తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

617 కోట్ల రూపాయల‌తో 20 ఎకరాల స్థలంలో సచివాలయ నిర్మాణం జరుగుతోంది. ఆరు ఫ్లోర్స్ లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్స్ ఉండనున్నాయి. సిక్స్త్ ఫ్లోర్ లో సీఎం ఆఫీస్ తోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్‌ ఉంటాయి.

Advertisement
Update:2023-01-15 14:02 IST

తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న ప్రారంభించనున్నారు. ఈ సచివాలయం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడించారు.

617 కోట్ల రూపాయల‌తో 20 ఎకరాల స్థలంలో సచివాలయ నిర్మాణం జరుగుతోంది. ఆరు ఫ్లోర్స్ లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్స్ ఉండనున్నాయి. సిక్స్త్ ఫ్లోర్ లో సీఎం ఆఫీస్ తోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్‌ ఉంటాయి. ఇక సెకండ్ ఫ్లోర్ నుంచి మంత్రుల కార్యాలయాలు ఉంటాయి. మొదటి, రెండవ అంతస్తుల్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఆఫీసులు ఉంటాయి.

అయితే, సచివాలయ నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదని సమాచారం. ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, ప్రధాన ప్రవేశద్వారం, పోర్టికో వంటి పనులు ఇంకా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 17 లోగా నిర్మాణ పనులు పూర్తయితే మొత్తం భవనాన్ని, లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్థును, సాధారణ పరిపాలనాశాఖ కోసం మరో అంతస్థును సిద్ధం చేసి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

కాగా, సచివాలయ ప్రారంభోత్సవంపై నిర్ణయం తీసుకోవడంతో నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. నిర్మాణ పనుల్లో వేగం పెంచడానికి మూడు షిప్టుల్లో పనులు చేస్తున్నట్లు సమాచారం.

నూత‌న స‌చివాల‌యానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టిన విష‌యం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News