తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు..

ప్రసవాల విషయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాలు కేవలం 33శాతం. ఇప్పుడు ఆ సంఖ్య 66శాతానికి పెరగడం విశేషం.

Advertisement
Update:2022-11-06 07:18 IST

తెలంగాణలో ఏ రంగాన్ని తీసుకున్నా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత.. అనేంతలా మారిపోయాయి పరిస్థితులు. కేసీఆర్ హయాంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ సమ్మిళిత అభివృద్ధి సాధించింది. వైద్య రంగంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులొచ్చాయి, వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో ప్రభుత్వం, పేదలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రసవాల విషయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులు.

33శాతం నుంచి 66 శాతానికి పెరిగిన ప్రసవాలు..

ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలంటే, అక్కడ జరిగే ప్రసవాల లెక్క తీస్తే చాలు. ఆస్పత్రులపై నమ్మకం ఉంటేనే, మంచి సౌకర్యాలు ఉన్నాయనుకుంటేనే అక్కడికి వెళ్తారు గర్భిణులు. పుట్టే బిడ్డ విషయంలో తల్లిదండ్రులు ఏ చిన్న విషయంలోనూ రాజీ పడరు. ప్రభుత్వ ఆస్పత్రులపై ఆ నమ్మకం ఉంది కాబట్టే, ఇప్పుడు తెలంగాణలో గర్భిణులు సర్కారు దవాఖానాలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ధీమాగా వారిని ప్రసవాలకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాలు కేవలం 33శాతం. ఇప్పుడు ఆ సంఖ్య 66శాతానికి పెరగడం విశేషం.

రాష్ట్ర వ్యాప్తంగా 67 కోట్ల రూపాయలతో కొత్త పి.హెచ్.సి. భవనాలు నిర్మించడం, మరో 43 కోట్లతో పాతవాటికి మరమ్మతులు చేపట్టారు అధికారులు. రూ.20 లక్షల యూనిట్ వ్యయంతో 1239 సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ.247 కోట్లతో కొత్తభవనాలు నిర్మిస్తున్నారు. పనితీరు మెరుగుదల, ప్రజలకు నాణ్యమైన సేవల కోసం అన్ని పి.హెచ్.సిల్లో ఇంటర్నెట్ సదుపాయం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సిజేరియన్ల సంఖ్య కూడా తగ్గడం విశేషం. 6 శాతం సిజిరేయన్లు తగ్గి సహజ ప్రసవాలు పెరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల చొరవ, ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో ఈ ఫలితాలు వచ్చాయంటున్నారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News