దళితులకు ఇచ్చే అన్ని పథకాలు గోసంగి కులస్తులకు కూడా..

ప్రత్యేక పథకాలతో దళితులను ఆదుకుంటున్నట్టే గోసంగుల అభివృద్ధికి కూడా సాయమందిస్తామని వారికి హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ లో వారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

Advertisement
Update:2023-11-11 15:47 IST

నిజామాబాద్ లో గోసంగి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో దళితులకు ఇచ్చే అన్ని పథకాలను గోసంగులకు కూడా వర్తింపజేస్తామని ఆమె హామీ ఇచ్చారు. కేసీఆర్ సీఎంగా ఉంటేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారామె. గోసంగుల ఆర్థిక ఉన్నతికి కొత్త పథకాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. గోసంగులు బీఆర్ఎస్ కి అండగా ఉండాలని కోరారు కవిత.

గోసంగి కులానికి చెందినవారు వివిధ కళారూపాల్లో బిక్షాటన చేస్తూ సంచార జీవితం గడుపుతుంటారు. మూలికా వైద్యం, అత్తరు అమ్మడం వీరి కులవృత్తి. అటవీ ప్రాంతాన్ని వదిలిపెట్టి మైదాన ప్రాంతాలకు వచ్చినా కూడా వీరు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడే ఉన్నారు. నిజామాబాద్ ప్రాంతంలో గోసంగుల జనాభా ఎక్కువ. సంచార జీవనంతో ప్రభుత్వ పథకాలకు కూడా వీరు దూరంగా ఉండేవారు. ఇప్పుడిప్పుడే వీరు స్థిర నివాసాలు ఏర్పర్చుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు కూడా వీరికి అందుతున్నాయి. అయితే ప్రత్యేక పథకాలతో దళితులను ఆదుకుంటున్నట్టే గోసంగుల అభివృద్ధికి కూడా సాయమందిస్తామని వారికి హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ లో వారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

దళితబంధు కొందరికే ఇచ్చారనే ఆందోళన వద్దని, విడతల వారీగా అందరికీ వస్తుందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. బీడీ కార్మికులకు పెన్షన్‌ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ దక్షిణ భారత దేశంలోనే చరిత్ర సృష్టిస్తారని అన్నారు కవిత. మోదీ అస్తవ్యస్త పాలనా విధానాలవల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. కర్నాటకలో ఫెయిలైన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో మెరుగైన పాలన ఎలా అందిస్తుందని అన్నారు కవిత. 

Tags:    
Advertisement

Similar News