కారు నడిపిన కవిత.. కొత్త చరిత్ర లిఖిస్తామని ధీమా

నిన్న బీఆర్‌ఎస్‌ బోధన్‌ అభ్య ర్థి షకీల్ నామినేషన్ సందర్భంగా స్కూటర్ పై కూర్చుని ఆర్వో కార్యాలయం వరకు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. ఈరోజు కారు నడుపుతూ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు.

Advertisement
Update:2023-11-10 18:47 IST

దక్షిణ భారతదేశంలో మూడుసార్లు వరుసగా సీఎం అయిన చరిత్ర ఎవరికీ లేదని, కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి సీఎం అయ్యి హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కూడా వరుసగా మూడోసారి గణేష్ గుప్తా గెలవడం ఖాయమన్నారు. గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, స్వయంగా కారు నడిపి ర్యాలీలో ముందుకు కదిలారు.


నిన్న స్కూటర్..

నిన్న బీఆర్‌ఎస్‌ బోధన్‌ అభ్య ర్థి షకీల్ నామినేషన్ సందర్భంగా స్కూటర్ పై కూర్చుని ఆర్వో కార్యాలయం వరకు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. ఈరోజు కారు నడుపుతూ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు నమూనాగా తయారు చేసిన గులాబీ రంగు అంబాసిడర్ కారును ఆమె నడిపారు.

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం..

నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత ప్రచార కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొంటున్నారు. అభ్యర్థుల నామినేషన్ ర్యాలీల్లో కూడా ఆమె ముందుండి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ మరోసారి కేసీఆర్ ని సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ పైనే నమ్మకం ఉందని, ఈసారి కూడా తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని అంటున్నారామె. నిజామాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, గతంలో కాంగ్రెస్, బీజేపీకి అవకాశమిచ్చినా పనులు జరగలేదన్నారు. నిజామాబాద్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు. రౌడీయిజం, గూండాయిజాన్ని నిజామాబాద్ నుంచి తరిమేశామని, శాంతి భద్రతలను కాపాడటంలో ముందున్నామని చెప్పారు కవిత. 

Tags:    
Advertisement

Similar News