మహిళా బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిది

కాళేశ్వరానికి జాతీయ హోదా, నిజామాబాద్ లో పసుపు బోర్డు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మోదీ, తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు ఎమ్మెల్సీ కవిత.

Advertisement
Update:2023-09-26 07:39 IST

మహిళా బిల్లు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ప్రస్తుతం పార్లమెంట్ ఆమోదించిన మహిళా బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కులాంటిదని అన్నారు. మరోసారి అధికారంలోకి రావాలన్న కోరికతోనే ఆ బిల్లుని కేంద్రం ప్రేశపెట్టిందని, కాంగ్రెస్ కూడా అదే ఉద్దేశంతో అనుకూలంగా ఓటు వేసిందని వివరించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేసిన ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని, లోక్ సభ లో మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిందిని అన్నారామె. బీఆర్ఎస్ ఏది అడుగుతుందో అది దేశం కోరుకుంటుందని చెప్పారు కవిత. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఆశీర్వాద ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.

భారీ ర్యాలీ..

నిజామాబాద్ అర్బన్ కు 60కోట్ల రూపాయల మంజూరు, పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదం సందర్భంగా.. నగరంలో బీఆర్ఎస్ ఆశీర్వాద ర్యాలీ జరిగింది. ఐటీఐ గ్రౌండ్స్ నుంచి కలెక్టరేట్ వరకు ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా.. ఇతర నేతలు పాదయాత్ర చేపట్టారు. అడుగడుగునా ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు.

మోదీజీ..! సమాధానం చెప్పండి..

ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న మోదీ.. ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కాళేశ్వరానికి జాతీయ హోదా, నిజామాబాద్ లో పసుపు బోర్డు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మోదీ, తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు.


కాంగ్రెస్ కి ఆ తెలివి ఉంటే..?

ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట్లాడుతోందని, 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీకి ఆ తెలివి ఉంటే అప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు న్యాయం జరిగేదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. రాహుల్ గాంధీ ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లంటూ చిలక పలుకులు పలుకుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కి ఏవీ గుర్తుకు రావన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని చెప్పారు కవిత. 

Tags:    
Advertisement

Similar News